ధనార్జనలో నం-1 : అనుష్క | anuska number one position in heroines income | Sakshi
Sakshi News home page

ధనార్జనలో నం-1 : అనుష్క

Published Sat, Aug 23 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

ధనార్జనలో నం-1 : అనుష్క

ధనార్జనలో నం-1 : అనుష్క

ధనార్జనలో నం-1
ధనార్జనలోనూ నంబర్ ఒన్ నటి అనుష్కనే. నటి నాయికలు నటనకు ప్రాధాన్యతనిస్తే నేటి నాయికలు ధనానికి ప్రాముఖ్యానిస్తున్నారన్నది సినీ విజ్ఞుల భావన. అందుకు తగ్గట్టుగానే ఆదాయమే ధ్యేయంగా మారుతున్నారు మన హీరోయిన్లు. ధనార్జనకు ఉన్న అవకాశాలన్నీ పుష్కలంగా వాడేసుకుంటున్నారు.

అలా ధనాన్ని అధికంగా కూడబెడుతున్న నాయికల్లో నటి అనుష్కకదే నంబర్ ఒన్ స్టార్ అంటున్నారు. హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ ఇటు సినిమాల్లోనూ అటు వాణిజ్య ప్రకటనలతోనూ మరో వైపు ప్రముఖ వాణిజ్యసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ కోట్లు సంపాదిస్తున్న నంబర్ ఒన్ హీరోయిన్. అనుష్కానేనని అంటున్నారు.
 
నిజానికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార పేరు నమోదయినా, ఆమె వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండడంతో అనుష్క ధనార్జన కంటే ఈ మలయాళ భామ ఆదాయం తక్కువేనట. ఇక నటి సమంత, కాజల్, త్రిష, హన్సిక లాంటి తారలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ భారీ స్థాయిలో సంపాదించుకుంటున్నారు. అయితే అనుష్క భారీ వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నది తాజా సమాచారం.
 
ఇటీవల ఒక మొబైల్ ఫోన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పంద పత్రాలపై సంతకం చేసి కోటికిపైగా పారితోషికం పుచ్చుకున్నారన్నది సమాచారం.  అనుష్క ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ సరసన లింగా చిత్రంతోపాటు అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు రుద్రమాదేవి, బాహుబలి చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement