anuska
-
పెళ్లికి సిద్ధమైన స్వీటీ?
-
మేకింగ్ ఆఫ్ మూవీ - భాగమతి
-
అజిత్‌తో స్వీటీ..
సాక్షి, సినిమా: అజిత్‌ను ఆయన అభిమానులు స్మార్ట్‌గా చూసి చాలా ఏళ్లే అయ్యింది. నలబై(ఏళ్లు)లో పడ్డాను.. ఇంకా ఎంత కాలం యువకుడిగా నటించాలి అని ఆయనే చాలా కాలం క్రితం బహిరంగంగా అనేశారు. అన్నట్టుగానే ఆ తరువాత మెరిసిన జుట్టు, గెడ్డం అంటూ వరుసగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటిస్తూ వస్తున్నారు. వీరం, వేదాళం, వివేగం వంటి చిత్రాల్లో అజిత్ ఇలా రియల్ గెటప్స్‌తోనే తన అభిమానుల్ని అలరించారు. అయితే ఫర్ ఏ ఛేంజ్ అన్నట్లుగా తాజా చిత్రంతో మళ్లీ పాత అజిత్‌గా యంగ్‌గా కనిపించడానికి రెడీ అవుతున్నారట. అందుకు బాగా కసరత్తులు చేసి బరువు కూడా తగ్గారని తెలుస్తోంది. అజిత్ ఇంత స్మార్ట్‌గా మారి తాజాగా ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఆయన శివ దర్శకత్వంలో నాలుగోసారి నటించనున్న చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్‌ను కరారు చేసిన విషయం తలిసిందే. వీరం,వేదాళం చిత్రాల్లో దాదాగానూ, వివేగం చిత్రంలో ఇంటర్ పోల్ అధికారిగానూ నటించిన అజిత్ తాజాగా మరోసారి విశ్వాసం కోసం దాదాగా మారబోతున్నారని తెలిసింది. ఇది ఉత్తర చెన్నైలోని దాదాల మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కనుందట.ఈ చిత్రం 90 శాతం చెన్నైలోనే చిత్రీకరించుకోనుందని సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ బారీ చిత్రం జనవరి 19న సెట్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇందులో అజిత్‌తో జత కట్టే నాయకి ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. అయితే నటి కీర్తీసురేశ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా అందాల భామ అనుష్కను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు ‘ఎన్నై అరిందాల్’ చిత్రంలో అజిత్‌తో రొమాన్స్ చేశారన్నది గమనార్హం. అయితే విశ్వాసంలో అనుష్క నటించే విషయాన్ని చిత్ర వర్గాలు ఇప్పటికీ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదు. నటి అనుష్క నటించిన ద్విభాషా చిత్రం భాగమతి ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై పెద్ద అటెన్షన్‌నే క్రియేట్ చేసింది. ఈ హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం సంక్రాంతికి వెండితెరపై అలజడి సృష్టించడానికి రెడీ అవుతోందని సమాచారం. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఏ దిల్ హై ముష్కిల్
-
'హీరో'యిన్
-
రుద్రమ ప్రతాపం
-
రుద్రమదేవి రిలీజ్ ఎప్పుడు..?
-
ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అనుష్క..?
-
బరువు పెరుగుతున్న బొమ్మాళి!
సవాల్ మీద సవాల్. ఇలా గత రెండేళ్లుగా అనుష్క సవాళ్లను సునాయాసంగా స్వీకరిస్తున్నారు. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల కోసం గుర్రపుస్వారీ, విలువిద్య, కత్తిసాము వంటివన్నీ నేర్చుకున్న బొమ్మాళి శారీరక భాషనూ మార్చుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పాత్రలను తలదన్నే విధంగా మరో ‘బరువైన పాత్ర’ను ‘సైజ్ జీరో’ చిత్రంలో చేస్తున్నారు. ఇది ఎంత బరువైన పాత్ర అంటే.. దీని కోసం అనుష్క 20 కిలోల బరువు పెరుగుతున్నారు. అందరు కథానాయికలూ తమ బరువు తగ్గించు కుని జీరో సైజ్‌కు వెళ్తుంటే, అనుష్క మాత్రం దీనికి విరుద్ధంగా పాత్ర కోసం బరువు పెంచుకోవడం సాహసమే. లావుగా ఉన్న అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడే కథ ఇది. బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యం ముఖ్యమనేది ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో రుద్రమదేవి
తమిళ రుద్రమదేవి శ్రీ తేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో చేరింది. నటి అనుష్క వీరనారి రుద్రమదేవిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ అత్యంత వ్యయప్రయాసాలతో అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో సెల్యులాయిడ్ కెక్కించారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి వీరగాథే ఈ చిత్ర ఇతివృత్తం. అరుంధతి చిత్రంలో టైటిల్ పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్న అనుష్క ఈ చిత్రంలో రుద్రమదేవిగా జీవించారనే చెప్పాలి. ఇతర ముఖ్యపాత్రల్లో అల్లుఅర్జున్, రానా, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, సుమన్, మెడ్రాస్ చిత్ర నాయకి కేథరిన్ త్రెస్రా, విజయకుమార్, హంస నందిని, అతిథి సెంగప్ప తదితరులు నటించారు. చిత్రంలో పోరు సన్నివేశాలు, గుర్రపు స్వారీలు, కత్తిసాములు అంటూ పలు అద్భుత సన్నివేశాలు చోటు చేసుకున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత కళా దర్శకుడు తోట తరణి అద్భుత పనితనం హాలివుడ్ సాంకేతిక నైపుణ్యం, అజయన్ విన్సెంట్ ఛాయాగ్రహణ, చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్న జోధా అక్బర్ చిత్రం ఫేమ్ నిట్టాలూల, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసిన ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాల్ ఫిలింస్ నేత రామస్వామి పొందారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. -
ధనార్జనలో నం-1 : అనుష్క
ధనార్జనలో నం-1 ధనార్జనలోనూ నంబర్ ఒన్ నటి అనుష్కనే. నటి నాయికలు నటనకు ప్రాధాన్యతనిస్తే నేటి నాయికలు ధనానికి ప్రాముఖ్యానిస్తున్నారన్నది సినీ విజ్ఞుల భావన. అందుకు తగ్గట్టుగానే ఆదాయమే ధ్యేయంగా మారుతున్నారు మన హీరోయిన్లు. ధనార్జనకు ఉన్న అవకాశాలన్నీ పుష్కలంగా వాడేసుకుంటున్నారు. అలా ధనాన్ని అధికంగా కూడబెడుతున్న నాయికల్లో నటి అనుష్కకదే నంబర్ ఒన్ స్టార్ అంటున్నారు. హీరోయిన్గా టాప్ రేంజ్లో ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ ఇటు సినిమాల్లోనూ అటు వాణిజ్య ప్రకటనలతోనూ మరో వైపు ప్రముఖ వాణిజ్యసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ కోట్లు సంపాదిస్తున్న నంబర్ ఒన్ హీరోయిన్. అనుష్కానేనని అంటున్నారు. నిజానికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార పేరు నమోదయినా, ఆమె వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండడంతో అనుష్క ధనార్జన కంటే ఈ మలయాళ భామ ఆదాయం తక్కువేనట. ఇక నటి సమంత, కాజల్, త్రిష, హన్సిక లాంటి తారలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ భారీ స్థాయిలో సంపాదించుకుంటున్నారు. అయితే అనుష్క భారీ వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నది తాజా సమాచారం. ఇటీవల ఒక మొబైల్ ఫోన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పంద పత్రాలపై సంతకం చేసి కోటికిపైగా పారితోషికం పుచ్చుకున్నారన్నది సమాచారం. అనుష్క ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ సరసన లింగా చిత్రంతోపాటు అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు రుద్రమాదేవి, బాహుబలి చిత్రాల్లో నటిస్తున్నారు. -
ఆరోగ్యంగా ఉన్నా : రజనీకాంత్
అభిమానలు కోరుకున్నంత కాలం, నటుడిగా కొనసాగుతానని రజనీకాంత్ అన్నారు. ఇంతకు ముందు ఈ ఇండియన్ సూపర్ స్టార్ గురించి పలు రకాల వార్తలు ప్రచారమయ్యాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని, వస్తున్నారని, భవిష్యత్ రాజకీయాలకు కేంద్ర బిందువు ఆయనేనంటూ ప్రచారాలు విస్తృతంగా సాగారుు. రాజకీయ రంగ ప్రవేశంపై ఒక దశలో రజనీకి ఆయన అభిమానుల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ ప్రస్తుతం లింగా చిత్ర షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం ఒకటి. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అందాల భామ అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఇటీవల రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారని, తూలి కింద పడిపోయారనే వదంతులు ఆయన అభిమానులకు తీవ్ర కలవరం కలిగించాయి. వారి కలతను తీర్చే విధంగా రజనీ గురువారం తన ఆరోగ్యం గురించి, తాను నటిస్తున్న లింగా చిత్రం గురించి వెల్లడించారు. లింగా చిత్ర షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. షూటింగ్లో పాల్గొనడానికి రజనీ గురువారం వేకువజామున చెన్నైలో విమానం ఎక్కి మంగళూరు విమానాశ్రయూనికి చేరుకున్నారు. ఆయనని చూసిన అక్కడ పని చేసేవారు తమ స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో 20 నిమిషాల్లోనే ఆ ప్రాంతం వందలాది అభిమానులతో కిటకిటలాడింది. రజనీ దరిచేరాలని, ఆయనతో ఫొటోలు దిగాలని అభిమానులు ప్రయత్నించారు. అయితే విమానాశ్రయ అధికారులు, రజనీ రక్షణ వలయం వారిని నిలువరించింది. అనంతరం రజనీ విలేకరులతో ముచ్చటిస్తూ కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో చాలా నీరసించానన్నారు. భగవంతుని దయవల్ల, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనా ఫలం కారణంగా తనకు పునర్జన్మ కలిగిందన్నారు. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎలాంటి సమస్యలేదని యథాతథంగా షూటింగ్లో పాల్గొంటున్నానని చెప్పారు. లింగా షూటింగ్ కోసం మంగుళూర్ దాని పరిసర కొండ ప్రాంతాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. మంగుళూర్ చాలా సుందరమైన నగరంగా పేర్కొన్నారు. ఇక్కడ 50 రోజుల వరకు బస చేసి లింగా షూటింగ్లో పాల్గొంటానన్నారు. తన అభిమానులు కోరుకున్నంత వరకు నటిస్తానని చెప్పారు. లింగా చిత్రం అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఉంటుందని రజనీ వెల్లడించారు. -
విజయవాడలో సచిన్, అనుష్కల సందడి
-
నా విజయ రహస్యం ఇదే
విజయం అంతస్తు, గౌరవ మర్యాదలతోపాటు ఆనందాన్ని, అందాన్ని పెంచుతుంది. అందుకే అలాంటి విజయం కోసం పోరాటం. ఈ నిరంతర పోరులో విజయం సాధించిన నటి అనుష్క. తమిళం, తెలుగు భాషల్లో మేటి నటిగా వెలిగిపోతున్న ఈ బ్యూటీ విజయాల బాట వేసిన చిత్రం అరుంధతి అన్నది తెలిసిన విషయమే. ఆ తరువాత వేట్టైక్కారన్, సింగం, సింగం-2 అంటూ తమిళంలో విజయాలను చవిచూశారు. ప్రస్తుంత రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో చారిత్రాత్మక చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు. నటిగా దశాబ్దం దాటినా విజయపథంలో సాగుతున్న అనుష్క తన సక్సెస్ సీక్రెట్ గురించి వివరిస్తూ తన చిత్రాలు విజయవంతంగా ఆడుతున్నాయని, ఇది సంతోషకరమైన విషయమన్నారు. తన చిత్రాల విజయం కోసం తాను పాటించే మూడు అంశాలు ముఖ్యమయినవన్నారు. వాటిలో ప్రధానమైనది కథ అన్నారు. మంచి కథాంశం ఉన్న చిత్రాలను మాత్రమే అంగీకరిస్తున్నట్లు తెలిపారు. రెండో అంశం కథనం బాగా వచ్చిందా అన్న విషయం గురించి చూస్తానన్నారు. ఇక మూడో అంశం దర్శకుడు ప్రతిభావంతుడా, కాదా అన్న విషయాన్ని ధృడపరచుకుంటానన్నారు. ఈ అంశాలే తన విజయానికి ప్రధాన అంశాలని అనుష్క వివరించారు. మరో విషయం ఏమిటంటే హీరోయిన్లకు అందం చాలా అవసరం అన్నారు. శరీరాకృతికి కట్టుబాట్లు ఉంచుకోవాలని తెలిపారు. శారీరక అందంతోపాటు మానసిక అందం కూడా అవసరమని చెప్పారు. ఇందుకు శారీరక వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని అనుష్క పేర్కొన్నారు. -
ఆ గ్రామాలు..శోక సంద్రాలు
నిజాంసాగర్/బిచ్కుంద, న్యూస్‌లైన్ : బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి, మద్నూర్ మండలంలోని లక్ష్మాపూర్, మొగ గ్రామాలు శోక సంద్రాలయ్యాయి. జుక్కల్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపన్‌పల్లికి చెందిన రాజు, లక్ష్మాపూర్‌కు చెందిన గంగవ్వ, లక్ష్మీబాయి, మొగ గ్రామానికి చెందిన బస్వంత్, అనుష్క మరణించిన విషయం తెలిసిందే. సోమవారం వారి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోపన్‌పల్లికి చెందిన రాజు ఐదుగురు అన్నదమ్ములలో మూడోవాడు. తండ్రి అనారోగ్యంతో మరణించాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. బంధువుల పెళ్లి ఉండడంతో ఆదివారం మహమ్మద్‌నగర్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో మరణించాడు. శుభ కార్యానికి వెళ్లిన వ్యక్తి విగత జీవుడై శ్మశానానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు రోదిస్తున్నారు. లకా్ష్మపూర్ గ్రామానికి చెందిన సర్డెవార్ గంగవ్వ, సర్డెవార్ లక్ష్మీబాయి కూలీలుగా పనిచేసేవారు. పిల్లలను పెద్దకొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో చదివిస్తున్నారు. వారిని చూసి రావడానికి ఆదివారం హాస్టల్‌కు వెళ్లారు. పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని ఇంటికి పయనమయ్యారు. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని అనంత లోకాలకు తీసుకొని వెళ్లింది. కొద్ది సేపటి క్రితం తమతో మాట్లాడి వెళ్లిన వారు కానరాని లోకాలకు వెళ్లారంటే ఆ హాస్టల్ విద్యార్థులు నమ్మలే కపోతున్నారు. మొగకు చెందిన బస్వంత్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కూతురు పెద్దకొడప్‌గల్‌లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం నాడు భార్య కూలి పనులకు వెళ్లింది. హాస్టల్లో ఉన్న పెద్ద కూతురును చూసిరావడానికి బస్వంత్ చిన్న కూతురు అనుష్కతో కలిసి వెళ్లాడు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.