శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో రుద్రమదేవి | rudrama devi in the list of sri tenandal films | Sakshi
Sakshi News home page

శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో రుద్రమదేవి

Published Sat, Feb 28 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో రుద్రమదేవి

శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో రుద్రమదేవి

తమిళ రుద్రమదేవి శ్రీ తేనాండాళ్ ఫిలింస్ ఖాతాలో చేరింది. నటి అనుష్క వీరనారి రుద్రమదేవిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ అత్యంత వ్యయప్రయాసాలతో అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో సెల్యులాయిడ్ కెక్కించారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి వీరగాథే ఈ చిత్ర ఇతివృత్తం. అరుంధతి చిత్రంలో టైటిల్ పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్న అనుష్క ఈ చిత్రంలో రుద్రమదేవిగా జీవించారనే చెప్పాలి. ఇతర ముఖ్యపాత్రల్లో అల్లుఅర్జున్, రానా, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, సుమన్, మెడ్రాస్ చిత్ర నాయకి కేథరిన్ త్రెస్రా, విజయకుమార్, హంస నందిని, అతిథి సెంగప్ప తదితరులు నటించారు.

చిత్రంలో పోరు సన్నివేశాలు, గుర్రపు స్వారీలు, కత్తిసాములు అంటూ పలు అద్భుత సన్నివేశాలు చోటు చేసుకున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత కళా దర్శకుడు తోట తరణి అద్భుత పనితనం హాలివుడ్ సాంకేతిక నైపుణ్యం, అజయన్ విన్సెంట్ ఛాయాగ్రహణ, చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్న జోధా అక్బర్ చిత్రం ఫేమ్ నిట్టాలూల, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసిన ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాల్ ఫిలింస్ నేత రామస్వామి పొందారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement