ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్! | iam the nomber one in exise deprtment | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్!

Published Sun, Jan 31 2016 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్!

ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్!

ఎక్సైజ్ శాఖలో మొన్నటివరకు పెత్తనం కోసం ఆరాటపడి బదిలీవేటు వేయించుకున్న సంఘటనలు చూసైనా ఇంకా కొంత మంది అధికారులు గుణపాఠాలు నేర్వడం లేదని అబ్కారీ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్సైజ్ శాఖ మొత్తం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది.. నేనే నెంబర్ వన్ అని అబ్కారీ శాఖలోని ఓ ఉన్నతాధికారి హైదరాబాద్‌లోని జూబ్లీ క్లబ్‌లో గొప్పలు చెబుతున్నారట.

సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యల్ని సొంత శాఖలో సిబ్బంది జోరుగా ప్రచారం చేస్తున్నారట. ఇది విన్న అధికారులు కొందరు ‘‘ఆయనకు పేకాట ఆడేందుకే సమయం సరిపోవడం లేదు.. సొంత శాఖపై పట్టు సాధిస్తేనే కదా.. నెంబర్ వన్ అయ్యేది.. ఇక ఆయన ఎప్పుడు నెంబర్ వన్ కావాలి’’ అని నిష్టూరాలాడుతున్నారట.

 ఆయన వెనక అధికార పార్టీ అండ ఉందేమో కానీ.. నెంబర్ వన్ ఎప్పటికీ కాలేరని సిబ్బంది ఉద్ఘాటిస్తున్నారట. నెంబర్ వన్ అని ఊగి.. చినబాబు, నేను తమ్ముళ్లమే.. అని బీరాలు పలికి చివరకు బయటకు వెళ్లిన ఉన్నతాధికారిని చూసైనా క్లబ్‌లో కోతలు కోస్తున్న అధికారి మారరా? అని అబ్కారీ శాఖలో గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement