సూపర్ స్టార్‌కు జోడీ లేదా? | No heroine for Rajinikanth in Ranjith's film? | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్‌కు జోడీ లేదా?

Published Tue, May 26 2015 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

సూపర్ స్టార్‌కు జోడీ లేదా?

సూపర్ స్టార్‌కు జోడీ లేదా?

 తాజా చిత్రంలో సూపర్ స్టార్‌కు హీరోయిన్ లేరట. లింగా చిత్రం తరువాత సూపర్‌స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారన్న విషం తెలిసిందే. లింగా చిత్ర సమస్యలు సూపర్‌స్టార్ చాలా డిస్ట్రబ్ చేశాయని చెప్పవచ్చు. చిత్రం హిట్ అయినా, ఫట్ అయినా తనకు సంబంధం లేదని నిర్ణయానికి వచ్చిన రజినీ ఈ సారి తన వయసుకు తగ్గ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అట్టకత్తి, మెడ్రస్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రంజిత్ రజినీ కోసం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథను వండారట.
 
 ఇందులో సూపర్ స్టార్ దాదా పాత్రను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్ ఉండరట. అయితే ఒక ముఖ్య పాత్రలో ప్రముఖ నటినొకరిని నటింప చేయడానికి ఆమెతో చర్చలు జరుగుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్ ధాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. చిత్రం వచ్చే నెలలో చెన్నైలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం తరువాత రజినీ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. దీనికి నెంబర్ ఒన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఐన్‌గారన్ ఫిలింస్ కరుణామూర్తి నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుందని కోలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement