వేదిక మారినా... ప్రత్యర్థి కొత్త వారైనా... అదే జోరు... అదే సమన్వయం... ఆఖరికి అదే ఫలితం... వెరసి భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా తన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో శనివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై విజయం సాధించింది.
Published Sun, Oct 4 2015 6:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement