Vuhan Open
-
కరోనా: అణ్వాయుధాల కంటే భారీ నష్టం మిగిల్చింది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాల గురించి తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే మరో పక్క కొందరు ప్రముఖులు మాత్రం ఆ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరని నమ్ముతున్నారు. తాజాగా ఆ జాబితాలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేరారు. మే 30న, డైలీ మెయిల్ లో వచ్చిన ఒక కథనంలో ఈ మహమ్మారి విలయానికి చైనానే కారణమని, ఈ వైరస్‌ను ఆ దేశ శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడిన విషయం తెలిసిందే. చైనా శాస్త్రవేత్తలు కోవిడ్ వైరస్‌ను వుహాన్ ప్రయోగశాలలో సృష్టించారని, ఆపై "వైరస్ రివర్స్-ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా వారి తప్పును కప్పిపుచ్చడానికి గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా చేసినట్లు" ఆ నివేదిక పేర్కొంది. ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కథనంపై స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా మే 31న ఇలా వ్రాశారు.. "మనం ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేము కానీ వాస్తవం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాగే జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక(నాన్-ప్రొలిఫరేషన్) ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోవిడ్ వైరస్ ఇప్పటికే యావత్ ప్రపంచానికి అణ్వాయుధం కంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. We may never get to know the truth. But the reality is that just like the Nuclear Non-Proliferation Treaty, the world now probably needs a Biological Weapons & Hazardous Research Non-Proliferation Treaty. This virus has already caused more global damage than a nuclear weapon. https://t.co/Uid1U2ffwf — anand mahindra (@anandmahindra) May 31, 2021 ఇప్పటివరకు కరోనా మహమ్మారి వల్ల 35.65 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణించగా, 3లక్షల పైచిలుకు మరణాలతో భారత్ రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్ నుంచి భారీగా పెరిగిన కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కొద్దీ రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా మూలాలను 90 రోజుల్లోగా కనిపెట్టాలని ఆ దేశ నిఘా బృందాన్ని హెచ్చరించారు. ఈ కరోనా మహమ్మరి కారణంగా అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూలిపోయాయి. చదవండి: బ్లాక్ ఫంగస్‌కు హైదరాబాద్ సెలాన్ ఔషధం -
అదే జోరు... అదే ఫలితం
-
అదే జోరు... అదే ఫలితం
సానియా-హింగిస్ జంటకు ఏడో డబుల్స్ టైటిల్ వుహాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఇండో-స్విస్ ద్వయం రూ. 84 లక్షల 98 వేల ప్రైజ్‌మనీ సొంతం న్యూఢిల్లీ: వేదిక మారినా... ప్రత్యర్థి కొత్త వారైనా... అదే జోరు... అదే సమన్వయం... ఆఖరికి అదే ఫలితం... వెరసి భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా తన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో శనివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై విజయం సాధించింది. గంటా తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడానికి శ్రమించాయి. ఫలితంగా మ్యాచ్ మొత్తంలో ఐదు సర్వీస్ బ్రేక్‌లు నమోదయ్యాయి. సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన సానియా-హింగిస్ జంట ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. అయితే కీలకదశలో పాయింట్లు నెగ్గి ఫలితాన్ని శాసించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు లక్షా 30 వేల 300 డాలర్ల (రూ. 84 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో సానియా మొత్తం 10 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదింటిలో విజేతగా నిలిచింది. హింగిస్‌తో కలిసి ఏడు... బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఒక టైటిల్‌ను ఈ హైదరాబాద్ అమ్మాయి కైవసం చేసుకుంది. ఓవరాల్ కెరీర్లో సానియాకిది 30వ టైటిల్. మరోవైపు హింగిస్కిది 48వ టైటిల్. గత 13 మ్యాచ్‌ల్లో సానియా-హింగిస్ జంట ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఆదివారం ఆరంభమయ్యే చైనా ఓపెన్‌లో సానియా-హింగిస్ జంటకు టాప్ సీడింగ్ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మేమిద్దరం మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. అందుకే వరుస సెట్లలో మ్యాచ్‌లను గెలుస్తున్నాం. కోర్టు లోపల, కోర్టు బయట మేమిద్దం మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. క్లిష్ట సమయాల్లో పరస్పరం విశ్వసిస్తాం. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి. -సానియా మీర్జా