కాలిఫోర్నియా (అమెరికా): ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 7-5తో కేసీ డెలాక్వా-సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్‌లో వానియా కింగ్ (అమెరికా)-అలా కుద్రయెత్సెవా (రష్యా)లతో సానియా-హింగిస్ తలపడతారు.