సానియా జంట జైత్రయాత్రకు బ్రేక్ | Sania Mirza and Martina Hingis’ winning streak ends at 41 | Sakshi
Sakshi News home page

సానియా జంట జైత్రయాత్రకు బ్రేక్

Published Sat, Feb 27 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

సానియా జంట జైత్రయాత్రకు బ్రేక్

సానియా జంట జైత్రయాత్రకు బ్రేక్

దోహా: గతేడాది ఆగస్టులో మొదలైన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట అప్రతిహత విజయయాత్రకు బ్రేక్ పడింది. ఖతార్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ జోడీకి ఓటమి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-2, 4-6, 5-10తో ఎలీనా వెస్నినా-దరియా కసాత్‌కినా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది.

దాంతో సానియా-హింగిస్ జోడీ 41 వరుస విజయాలకు తెరపడింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట తడబడి మూల్యం చెల్లించుకుంది. ఒకవేళ ఈ టోర్నీలో సానియా జంట విజేతగా నిలిచిఉంటే 1990లో జానా నొవోత్నా-నటాషా జ్వెరెవా నెలకొల్పిన 44 వరుస విజయాల రికార్డును సమం చేసేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement