సానియా-హింగిస్ జంటకు షాక్ | Sania Mirza -Martina Hingis pair Shock | Sakshi
Sakshi News home page

సానియా-హింగిస్ జంటకు షాక్

Published Mon, Mar 14 2016 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

సానియా-హింగిస్ జంటకు షాక్

సానియా-హింగిస్ జంటకు షాక్

ఇండియన్ వెల్స్ ఓపెన్ టోర్నీ
 
కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా రెండో ఏడాది ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ జోడీకి ఈసారి రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 4-6తో వానియా కింగ్ (అమెరికా)-అలా కుద్రయెత్సెవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement