మాడ్రిడ్: సీజన్‌లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 4-6తో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.
రన్నరప్‌గా నిలిచిన సానియా-హింగిస్‌లకు 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రెండు వారాల క్రితం స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీ ఫైనల్లోనూ సానియా జంట గార్సియా-మ్లాడెనోవిచ్ చేతిలోనే ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
రన్నరప్ సానియా-హింగిస్ జంట
Published Sun, May 8 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement
Advertisement