పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో లియాండర్ పేస్(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో పేస్-హింగిస్ల జోడి 6-4, 6-4 తేడాతో అన్నా లీనా గ్రోన్ఫెల్డ్(జర్మనీ)- రాబర్ట్ ఫరాఖ్(కొలంబియా) ద్వయంపై గెలిచి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. తొలి సెట్లో ఇరు జోడీలు 2-2 తో సమానంగా నిలిచిన సమయంలో పేస్-హింగిస్లు 4-2 తో ముందంజ వేసింది. ఆ తరువాత ఇరు జోడీలు తమ సర్వీసులు కాపాడుకుంటూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించారు. అయితే 10 గేమ్ లో మాత్రం పేస్-హింగిస్లు అనవసర తప్పిదాలు చేయకుండా తొలి సెట్ను గెలుచుకున్నారు.
ఇక రెండో సెట్ మూడో గేమ్లో ఆధిక్యం సాధించిన పేస్-హింగిస్లు.. ఎనిమిదో గేమ్ లో రెండు బ్రేక్ పాయింట్లు లభించడంతో మరింత ముందుకు వెళ్లారు. అయితే ఆపై అన్నా లీనా గ్రోన్ఫెల్డ్-రాబర్ట్ ఫరాఖ్ లు ఎదురుదాడికి దిగినా, పేస్-హింగిస్ల తన అనుభవాన్ని ఉపయోగించి రెండో సెట్ ను కైవసం చేసుకుని ప్రి క్వార్టర్స్ కు చేరారు. గతేడాది ఈ జోడీ ఆస్ట్రేలియా, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ టైటిల్స్ ను గెలిచిన సంగతి తెలిసిందే.
ప్రి క్వార్టర్స్కు చేరిన పేస్-హింగిస్ జోడి
Published Thu, May 26 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM
Advertisement
Advertisement