సెమీస్‌లో సానియా జంట | semis in a couple of Sania | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట

Published Sun, Aug 16 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

సెమీస్‌లో సానియా జంట

సెమీస్‌లో సానియా జంట

టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా జోడీ 6-4, 6-2తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఈ ఇండో-స్విస్ జంట నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా-కాటరీనా స్రెబోత్నిక్‌లతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement