సెమీస్‌లో ఓడిన సానియా జంట
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఈ జోడీ 3-6, 2-6 తేడాతో కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్), కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన సానియా జంట తమ సర్వీస్‌ను ఐదు సార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. సెమీస్‌లో నిష్ర్కమించిన సానియా జోడికి 350 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 32,520 డాలర్లు (రూ. 21 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.