యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ | leander paes and martina hingis pair enter into US open mixed doubles finals | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ

Published Thu, Sep 10 2015 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ

యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ

న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) - యంగ్ జాన్ చన్ లపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ మిక్స్డ్ డబుల్స్ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది.

తొలి సెట్లో ఏ మాత్రం పోటీ ఇవ్వని బోపన్న-యంగ్ ద్వయం రెండో సెట్లో అద్భత పోరాట పటిమను ప్రదర్శించింది. కానీ, వెటరన్ ఆటగాడు పేస్, స్విస్ స్టార్ హింగిస్ జోడీ అనుభవం ముందు బోపన్న జంట తలవంచక తప్పలేదు. మహిళల డబుల్స్ విభాగంలోనూ మార్టినా హింగిస్ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మిర్జాతో కలిసి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement