సెమీస్ కు చేరిన సానియా జోడి | Unstoppable Sania-Martina reach WTA Finals semis | Sakshi
Sakshi News home page

సెమీస్ కు చేరిన సానియా జోడి

Published Fri, Oct 30 2015 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

సెమీస్ కు చేరిన సానియా జోడి

సెమీస్ కు చేరిన సానియా జోడి

సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా మూడో విజయాన్ని సాధించి సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించింది.

 

90 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో  ఈ ఇండో-స్విస్ జోడీకి గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్నా.. రెండో సెట్ లో మాత్రం తీవ్ర పోటీ తప్పలేదు. ఓదశలో సెట్ చేజారిపోతున్నట్లు కనిపించినా.. పోరాడి రెండో సెట్ ను కూడా కైవసం చేసుకుని సెమీస్ కు చేరింది. ఈ తాజా విజయంతో సానియా-హింగిస్ జంట తమ వరుస విజయాలను సంఖ్యను 20 కు పెంచుకుని తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement