స్టట్‌గార్ట్ (జర్మనీ): వరుసగా మూడు టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ సత్తా చాటుకుంది. పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-4, 7-5తో సబీనా లిసికి (జర్మనీ)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది.
గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో తడబడ్డాయి. సానియా జంట ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)-క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్) లేదా కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు.
ఫైనల్లో సానియా జంట
Published Sun, Apr 24 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement
Advertisement