ఫైనల్లో సానియా-హింగిస్ జంట | Sania Mirza-Martina Hingis vs Lisa Raymond-Sam Stosur, Indian Wells 2015 | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

Published Sat, Mar 21 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

ఫైనల్లో సానియా-హింగిస్ జంట

ఇండియన్ వెల్స్ ఓపెన్
కాలిఫోర్నియా: కలిసి ఆడుతున్న తొలి టోర్నమెంట్‌లోనే సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సానియా-హింగిస్ ద్వయం తమ జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-0, 6-4తో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీని ఓడించింది.

55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఫైనల్లో రెండో సీడ్ మకరోవా-వెస్నినా (రష్యా)లతో సానియా-హింగిస్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement