
సెమీస్ లో సానియా జోడి
వూహాన్:ఈ ఏడాది స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జోడి కట్టిన అనంతరం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వరుస విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల గ్వాంగ్‌జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టైటిల్ ను గెలిచిన ఈ జోడి.. చైనాలో జరుగుతున్న వూహాన్ ఓపెన్ లో సెమీస్ లోకి ప్రవేశించింది.
మహిళల డబుల్స్ లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడి 6-2, 6-2 తేడాతో అమెరికా జంట రక్వీల్ కాప్స్-జోన్స్ లను ఓడించి సెమీస్ కు చేరింది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సానియా జోడీ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు రెండో రౌండ్ లో ఆస్ట్రేలియన్ జంట లౌదియా జాన్స్- ఇగ్నాకిక్ లపై 3-6, 2-6 తేడాతో గెలిచిన సానియా జోడి అదే ఊపును క్వార్టర్స్ లో కూడా కనబరిచింది.