ఏడేళ్ల తర్వాత... | After seven years of ... | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత...

Published Tue, Apr 1 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

ఏడేళ్ల తర్వాత...

ఏడేళ్ల తర్వాత...

స్విస్ స్టార్ హింగిస్‌కు డబుల్స్ టైటిల్
 
 
 మియామి: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్... ఏడేళ్ల తర్వాత తన ఖాతాలో అంతర్జాతీయ టైటిల్‌ను జమచేసుకుంది. 33 ఏళ్ల ఈ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి జర్మనీ భామ సబీనా లిసికితో కలిసి ప్రతిష్టాత్మక సోనీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన హింగిస్-లిసికి ద్వయం ఫైనల్లో 4-6, 6-4, 10-5లో మకరోవా-వెస్నినా (రష్యా) జోడిపై గెలిచింది. 2007లో దోహా ఓపెన్ తర్వాత హింగిస్ నెగ్గిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఓవరాల్‌గా హింగిస్‌కిది 81వ టైటిల్ కావడం విశేషం.
     
ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన హింగిస్ గాయాల బారిన పడటంతో 2003లో ఆటకు వీడ్కోలు పలికింది. 2005లో పునరాగమనం చేసింది. 2007లో డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడటంతో మరోసారి కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. సస్పెన్షన్ కాలం ముగిశాక 2009లో మరోసారి రాకెట్ పట్టింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement