
స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం విశేషం.
17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డుసృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment