లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో సానియా జోడీ 6-2, 6-2 తేడాతో దియాస్-హెంగ్ ద్వయంపై విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు.
గంటా తొమ్మిది నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సానియా -హింగిస్ లు తమ పదునైన షాట్లతో అలరించి జయకేతనం ఎగురవేశారు. దీంతో తన తదుపరి మ్యాచ్ లో కిమికో డేట్ -ఫ్రాన్సెస్కాలతో పోరుకు సన్నద్ధమైయ్యారు.