క్వార్టర్స్‌లో సానియా జంట | sania team in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Wed, May 6 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట

న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో జానెట్టి హుసరోవా (స్లొవేకియా)-రలూకా ఒలారు (రుమేనియా) ద్వయంపై గెలిచింది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) శుభారంభం చేసింది.

తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా 5-7, 7-6 (7/5), 10-6తో మారిన్ ద్రగాంజ (క్రొయేషియా)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 5-7, 3-6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement