సెమీస్‌లో సానియా జంట | Sania couple enterd to the semisfinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట

Published Sat, May 14 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

Sania couple enterd to the  semisfinals

న్యూఢిల్లీ:  రోమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం రోమ్‌లో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2తో రాకెల్ అటావో-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది.

 మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-3, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)-విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement