న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-మార్టినా హింగీస్ జోడీ విజయం సాధించింది. 6-3, 6-3 తేడాతో డెలాక్వా- ష్వెదోవాను హింగీస్ సానియా జోడీ చిత్తు చేసింది. దాంతో యూఎస్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ టైటిల్ ను సానియా జోడీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ ను సానియా జోడీ సాధించింది.