‘మిక్స్‌డ్‌’లో సానియా జంటకు చుక్కెదురు | US open 2017: Leander Paes – Purav Raja in second round; Sania Mirza, Rohan Bopanna lose | Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌’లో సానియా జంటకు చుక్కెదురు

Published Sun, Sep 3 2017 1:44 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

‘మిక్స్‌డ్‌’లో సానియా జంటకు చుక్కెదురు - Sakshi

‘మిక్స్‌డ్‌’లో సానియా జంటకు చుక్కెదురు

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో సానియా–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) ద్వయం 7–5, 3–6, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఒస్టాపెంకో (లాత్వియా)–ఫాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండో రౌండ్‌లో పదో సీడ్‌ రోహన్‌ బోపన్న–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) ద్వయం 7–5, 4–6, 4–6తో ఫాబియో ఫాగ్‌నిని–సిమోన్‌ బొలెలీ (ఇటలీ) జంట చేతిలో... దివిజ్‌ శరణ్‌–ఆండ్రీ బెగెర్‌మన్‌ (జర్మనీ) జోడీ 4–6, 4–6తో ఫెలిసియానో లోపెజ్‌–మార్క్‌ లోపెజ్‌ (స్పెయిన్‌) జంట చేతిలో ఓడిపోగా... తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌–పురవ్‌ రాజా (భారత్‌) జోడీ 6–1, 6–3తో జాంకో టిప్సరెవిచ్‌–విక్టర్‌ ట్రయెస్కీ (సెర్బియా) జంటపై విజయం సాధించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement