సానియా జోడికి షాక్ | sania pair crashed out in women doubles of wimbledon | Sakshi
Sakshi News home page

సానియా జోడికి షాక్

Published Thu, Jul 7 2016 7:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

sania pair crashed out in women doubles of wimbledon

లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 2-6, 4-6 తేడాతో ఐదో సీడ్ తిమియా బాబోస్(హంగేరి)-ష్వెదోవా(రష్యా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.  దీంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన 'సాన్టీనా' జోడి భారంగా ఇంటి ముఖం పట్టింది. అనవసర తప్పిదాలతో సానియా జోడి తగిన మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బాబోస్ జంట అంచనాలు మించి రాణించడంతో పోరు ఆద్యంతం ఏకపక్షంగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement