క్వార్టర్స్ కు సానియా జోడి | sania pair enters into quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు సానియా జోడి

Published Mon, Jul 4 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

sania pair enters into quarters

లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడి క్వార్టర్స్కు చేరింది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 6-1, 6-0 తేడాతో మెక్  హేల్-ఓస్టాపెన్కోపై గెలిచి క్వార్టర్స్ కు చేరింది.  ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడి ఆద్యంతం ఆకట్టుకుంది.

 

తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక పాయింట్ మాత్రమే కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్లో మాత్రం దుమ్మురేపింది. మరోవైపు పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రోమేనియా) 6-2, 3-6, 6-4, 7-6, 6-8 తేడాతో కాంటినెన్-పీర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement