మరోసారి మెరిసిన సానియా | Sania Mirza, Martina Hingis Lift Guangzhou Open Title | Sakshi
Sakshi News home page

మరోసారి మెరిసిన సానియా

Published Sat, Sep 26 2015 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

మరోసారి మెరిసిన సానియా

మరోసారి మెరిసిన సానియా

గ్వాంగ్‌జూ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడి మరో టైటిల్ ను సాధించింది. గ్వాంగ్ జూ డబ్యుటీఏ ఫైనల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో సానియా -హింగిస్ ల జంట 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ- జూ యూ(చైనా)పై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నారు.

 

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో  సానియా జంట 58 నిమిషాల్లోనే తుదిపోరును ముగించి మరోసారి తమ సత్తాను చాటుకున్నారు.  తాజా టైటిల్ తో ఈ సంవత్సరం సానియా ఏడు టైటిల్స్ ను సాధించింది. అందులో ఆరు మార్టినా హింగిస్‌తో ఉండగా, మరొకటి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement