
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 4 గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినెర్‌ను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 6–2, 6–2తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించాడు. రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేíÙయా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై, ఏడో ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో 19వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment