ఎన్నో రకాల చీరలు గురించి విని ఉంటారు. ఇలాంటి కస్టమ్ వింబుల్డన్ చీర గురించి ఎప్పుడైనా విన్నారా..?. ఇది కస్టమ్ టెన్నిస్ నేపథ్య చీర. దీన్ని వడోదర ఆధారిత కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించారు. ఇది తెలుపు, ఆకుపచ్చలతో కూడిన ఆరు గజాల చీర. భారతదేశంలో అంత్యంత క్రేజీ ఆట అయినా వింబుల్డన్ టెన్నిస్ సీజన్ కోసం ప్రత్యేక దుస్తులను ధరించింది రిత్వి షా. దీన్ని భారతీయ కళాకారులు చక్కగా నేశారు. అంతేగాదు ఆ చీరపై సానియా మీర్జా నుంచి నోవాక్ జొకోవిచ్ వరకు వివిధ దిగ్గజ టెన్నిస్ ఛాంపియన్‌ల పేర్లను బంగారు ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు.
ఈ చీర మన టెన్నిస్ ఆట సంస్కృతికి సంబంధించిన ప్రధాన అంశాలను వివరిస్తోంది. చీర పల్లు మొత్త వింబుల్డన్ ట్రోఫీతో పెయింట్ చేయబడింది. ఇక చీర మొత్తం చిన్న చిన్న టెన్నిస్ రాకెట్లతో జర్దోజీ ఎంబ్రాయిడీ చేశారు. దీనిపై చేతితే ఎంబ్రాయిడరీ చేసిన స్ట్రాబెర్రీలను కూడా ఆ చీరపై చూడొచ్చు. గుంజరాత్‌కి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించిన చీరపైనే అందరి దృష్టి నిలిచింది.
సరికొత్త ఫాష్యన్ శైలికి ఈమె ఆటల నేపథ్యంతో ట్రెండ్ సెట్ చేసింది. ఒకరకంగా ఈ చీర క్రీడలు సంస్కృతిని వస్త్రధారణతో ఎలా మిళితం చేయొచ్చో చూపించింది. ఈ చీర డిజైనింగ్..చేతివృత్తుల వారి కృషిని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment