quarter-finals
-
టాప్ సీడ్ సినెర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 4 గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినెర్‌ను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 6–2, 6–2తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించాడు. రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేíÙయా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై, ఏడో ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో 19వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరారు. -
క్వార్టర్ ఫైనల్లోకి వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా శిఖరాన నిలిచేందుకు... క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌తో అరుదైన ఘనతను అందుకునేందుకు వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కేవలం మూడు విజయాల దూరంలో నిలిచాడు. ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో తన సత్తా చాటుతూ జొకో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడంతో చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యాడు. అమెరికా యువ ఆటగాడు బ్రూక్స్‌బీ కొంత పోటీనిచ్చినా, తన స్థాయిని ప్రదర్శిస్తూ సెర్బియా స్టార్ ముందంజ వేయగా... 1880 నుంచి ఈ టోర్నీ చరిత్రలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో ఒక్క అమెరికన్ కూడా క్వార్టర్స్ చేరకపోవడం ఇదే తొలిసారి. న్యూయార్క్: వరల్డ్ నంబర్‌వన్, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 1–6, 6–3, 6–2, 6–2తో జెన్సన్ బ్రూక్స్ బీ (అమెరికా)ను ఓడిం చాడు. 2 గంటల 59 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్ ను అనూహ్యంగా బ్రూక్స్‌బీ గెలుచుకున్నా ... ఆ తర్వాత జొకోవిచ్ పదునైన ఆట ముందు అతను తలవంచాల్సి వచ్చింది. బ్రూక్స్‌బీ ఓటమితో ఈ టోర్నీలో అమెరికా ఆటగాళ్లందరి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో మెద్వెదేవ్ రష్యా స్టార్ ప్లేయర్, రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ 6–3, 6–0, 4–6, 7–5తో ప్రపంచ 117వ ర్యాంకర్ బొటిక్ జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఇతర ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లలో బెరెటిని 6–4, 3–6, 6–3, 6–2తో ఆస్కార్ ఒటే (జర్మనీ)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 7–6 (9/7)తో సిన్నర్ (ఇటలీ)పై, లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) 6–7 (6/8), 6–4, 6–1, 6–3తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. చదవండి: టాప్ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–ప్రజ్నేశ్ జోడీ 7–6 (7/5), 6–4తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్)–లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్) జంటపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట రెండో సెట్లో ఏకంగా తొమ్మది బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం 6–4, 7–6 (7/4)తో యెకాంగ్ హి–డి వు (చైనా) జోడీపై నెగ్గగా... విష్ణువర్ధన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 6–7 (4/7), 6–7 (7/9)తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
హాకీ ప్రపంచ కప్ క్వార్టర్స్‌లో భారత్
లండన్: చావో రేవో మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మంగళవారం నిర్వహించిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు 3–0 గోల్స్ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (9వ ని.లో), నేహా గోయల్ (45వ ని.లో), వందన కటారియా (55వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ 1974 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 1974లో జరిగిన తొలి మహిళల ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఏనాడూ లీగ్ దశను అధిగమించలేకపోయిం ది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇటలీతో జరిగిన పోరులో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. సమన్వయంతో ముందుకు సాగుతూ అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. 9వ నిమిషంలో లాల్రెమ్సియామి చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అనంతరం 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నేహా లక్ష్యానికి చేర్చగా... 55వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను వందన కటారియా గోల్‌గా మలిచింది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐర్లాండ్‌తో భారత్ తలపడుతుంది. పూల్ ‘బి’లో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–1తో ఓడిపోయింది. -
నేడు వరల్డ్ కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్స్
-
సింధు, ప్రణయ్ క్వార్టర్స్‌కు...
జకార్తా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనాకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. హెచ్.ఎస్. ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకున్నాడు. బర్త్ డే గర్ల్ సింధు తన 23వ పుట్టినరోజును విజయంతో జరుపుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 21–17, 21–14తో జపాన్ ప్రత్యర్థి ఒహొరిని ఇంటి దారి పట్టించింది. ఒహోరిపై సింధుకిది ఐదో విజయం కాగా... వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్ చెన్ యుఫే చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ప్రణయ్ 21–23, 21–15, 21–13తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు. -
హలెప్ హవా...
అపారిస్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రొమేనియా క్రీడాకారిణి అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–2, 6–1తో 16వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హలెప్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడంతోపాటు నెట్ వద్దకు 10 సార్లు వచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. గత ఐదేళ్లలో ఈ టోర్నీలో హలెప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్, 12వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో హలెప్ తలపడుతుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 6–2, 6–3తో ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. కసత్కినా సంచలనం మరోవైపు రష్యా యువతార దరియా కసత్కినా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి కసత్కినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కసత్కినా 7–6 (7/5), 6–3తో వొజ్నియాకిపై నెగ్గింది. నాదల్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2, 7–6 (7/4)తో మాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. నాదల్ కెరీర్లో ఇది 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా –1,256), ఫెడరర్ (స్విట్జర్లాండ్–1,149), లెండిల్ (అమెరికా–1,068), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా– 948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆదివారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న ఈ స్పెయిన్ స్టార్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్లలో అంతగా పోటీ ఎదురుకాలేదు. కానీ మూడో సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయి మిగతా వాటిని నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్ పైచేయి సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 1–6, 2–6, 7–5, 7–6 (9/7), 6–2తో అండ ర్సన్ (దక్షిణాఫ్రికా)పై, డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–4, 6–4తో ఇస్నెర్ (అమెరికా)పై, సిలిచ్ (క్రొయేషియా) 6–4, 6–1, 3–6, 6–7 (4/7), 6–3తో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచారు. షరపోవాకు సెరెనా వాకోవర్... ఇద్దరు మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) మధ్య సోమవారం ‘బ్లాక్ బస్టర్’ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. భుజం కండరాలు పట్టేయడంతో సెరెనా కోర్టులోకి అడుగు పెట్టకుండానే షరపోవాకు ‘వాకోవర్’ ఇచ్చింది. దాంతో షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ‘భుజం కండరాలు పట్టేయడంతో సర్వీస్ చేసే పరిస్థితిలో లేను. టోర్నీకి ముందు ఈ సమస్య లేదు. జూలియా జార్జెస్‌తో జరిగిన మూడో రౌండ్లో భుజం నొప్పి మొదలైంది. గాయం కారణంగా వైదొలుగుతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. -
క్వార్టర్స్‌లో జయరామ్
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ అల్మెరా (నెదర్లాండ్స): డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. కెరీర్లో రెండుసార్లు ఈ టైటిల్ గెలిచిన టాప్‌సీడ్ జయరామ్... గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మా రియస్ మైరే (నార్వే)పై 21-6, 21-6 తేడాతో సునాయాసంగా నెగ్గాడు. క్వార్టర్స్‌లో గోర్ కొయెల్హే డి ఒలివిరా (బ్రెజిల్)తో జయరామ్ తలపడతాడు. ఇక పారుపల్లి కశ్యప్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. తను 18-21, 18-21 తేడాతో రౌల్ మస్ట్ (ఈస్టోనియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి, మేఘన జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో వీరు మాస్ జెల్లె, వాన్డర్పై 21-16, 21-18 (నెదర్లాండ్స) తేడాతో నెగ్గారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్స మను అత్రి, సుమీత్ రెడ్డి జోడితో పాటు ప్రణవ్, ఆక్షయ్ దే వాల్కర్ జోడి కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
క్వార్టర్స్‌లో సౌరభ్
తైపీ: చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రిలో భారత షట్లర్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన ర్యోటరో మరౌను 11-6, 11-8, 11-6తో ఓడించాడు. తొలి గేమ్‌లో 4-0తో దూసుకెళ్లినా ప్రత్యర్థి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా సౌరభ్ గేమ్‌ను ముగించాడు. ఇక రెండో గేమ్‌లో ఏకంగా 7-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అద్భుతంగా రాణించాడు. చివరి గేమ్ ప్రారంభంలో కాస్త పోటీ ఎదురైనా ఫలితంపై ప్రభావం చూపలేదు. నేడు (శుక్రవారం) జరిగే క్వార్టర్స్‌లో కెంటో హొరియుచి (జపాన్)తో సౌరభ్ తలపడనున్నాడు. -
క్వార్టర్స్‌కు చేరిన శ్రీకాంత్
టోక్యో: జపాన్ ఓపెన్‌లో తలపడుతున్న భారత ఆటగాళ్లలో కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే రేసులో మిగిలాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తన సహచర ఆటగాడు అజయ్ జయరామ్‌తో తలపడగా 21-16తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. అరుుతే గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే జయరామ్ తప్పుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 12-11తో జయరామ్ ఆధిక్యం కనబరిచినా ఆ తర్వాత శ్రీకాంత్ పుంజుకుని గేమ్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్.. మార్క్ జ్వీబ్లెర్ (జర్మనీ)తో తలపడతాడు. 2014లో జరిగిన ఇదే ఈవెంట్లో శ్రీకాంత్‌పై మార్క్ నెగ్గాడు. మరోవైపు హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 16-21, 19-21 తేడాతో రెండో సీడ్ విక్టర్ ఏక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 44 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రెండో గేమ్‌లో ప్రణయ్ గట్టి పోటీనే ఇచ్చినా విజయం సాధించలేకపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో జయరాం
బలిక్పపన్: ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అజయ్ జయరాం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. జయరాం మినహా మిగతా భారత షట్లర్లంతా టోర్నీనుంచి నిష్ట్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జయరాం రెక్సీ మేగానంద (ఇండోనేసియా)పై 18-21, 21-12, 21-19 స్కోరుతో విజయం సాధించాడు. అంతకు ముందు రెండో రౌండ్ మ్యాచ్‌లో అజయ్... భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌పై గెలుపొందడం విశేషం. గాయంనుంచి కోలుకున్న తర్వాత మొదటి టోర్నీ ఆడుతున్న కశ్యప్ తొలి మ్యాచ్ విజయం తర్వాత ముందుకు వెళ్లలేకపోయాడు. జయరాం 21-7, 21-12తో కశ్యప్‌ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ 27 నిమిషాల్లోనే ముగిసింది. ఇతర మ్యాచ్‌లలో సాయి ప్రణీత్ 14-21, 13-21తో బూన్సాక్ (థాయిలాండ్) చేతిలో, హెచ్ఎస్ ప్రణయ్ 21-19, 19-21, 21-23తో జియాంక్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి
క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి రియో డి జనీరో: రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 1-3 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. బెల్జియం 96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆట 15వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అయితే మూడో క్వార్టర్లో బెల్జియం ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస దాడులతో భారత్‌పై ఒత్తిడి పెంచారు. 34వ, 45వ నిమిషాల్లో సెబాస్టియన్ డాకీర్ రెండు గోల్స్ చేయడంతో బెల్జియం 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 50వ నిమిషంలో టామ్ బూన్ గోల్‌తో బెల్జియం 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. -
సెమీస్ లో యువ భారత్
అండర్-19 ప్రపంచకప్ ♦ క్వార్టర్స్‌లో నమీబియాపై ఘన విజయం ♦ రిషబ్ పంత్ సెంచరీ ఫతుల్లా: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. ఓపెనర్ రిషబ్ పంత్ (96 బంతుల్లో 111; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ (76 బంతుల్లో 76; 6 ఫోర్లు; 1 సిక్స్), అర్మాన్ జాఫర్ (55 బంతుల్లో 64; 4 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. శనివారం నమీబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 197 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ (6) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా పంత్ తన దూకుడును మరోసారి కనబరిచాడు. అన్మోల్ ప్రీత్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 103 పరుగులు, సర్ఫరాజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఆర్మాన్, సర్ఫరాజ్ నమీబియా బౌలర్లను ఆడుకున్నారు. బంతికో పరుగు చొప్పున సాధిస్తూ జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 98 పరుగులు చేరాయి. చివర్లో లోమ్రోర్ (21 బంతుల్లో41 నాటౌట్; 1 ఫోర్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. కొయిట్జీకి మూడు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ స్కోరు ఛేదన కోసం బరిలోకి దిగిన నమీబియా 39 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. తొలి వికెట్‌కు 59 పరుగులు జత చేరినా ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. డేవిన్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. దాగర్, అన్మోల్లకు మూడు, సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
సెమీస్‌లో సానియా-హింగిస్ జంట
సిన్సినాటి (అమెరికా): వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 6-1తో క్రిస్టినా మెక్హలె-కోకో వాండెవెగె (అమెరికా) జంటను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా జంట 1-6, 6-1, 12-14తో ‘సూపర్ టైబ్రేక్’లో డోడిగ్ (క్రొయేషియా)-మెలో (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
దూసుకుపోతున్న షరపోవా
మెల్ బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-3,6-2 తేడాతో ఎగునీ బౌచర్డ్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రత్యర్థలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఈ టోర్నీలో ఆకట్టుకుంటున్న షరపోవా వరుస రెండు సెట్లను కైవశం చేసుకుని తన తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఒకానొక దశలో షరపోవా సంధించిన ఏస్ లకు బౌచర్డ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. -
షరపోవా జోరు
అలవోక విజయంతో క్వార్టర్స్‌లోకి మెల్బోర్న్: ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా... స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షరపోవా 6-3, 6-0తో 21వ సీడ్ పెంగ్ షుయె (చైనా)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కేవలం 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా భామ నెట్ వద్దకు వచ్చిన ఐదుసార్లూ పాయింట్లు నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో ‘కెనడా బ్యూటీ’ యూజిన్ బౌచర్డ్తో షరపోవా తలపడుతుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బౌచర్డ్ 6-1, 5-7, 6-2తో ఇరీనా కమెలియా బెగూ (రుమేనియా)పై చెమటోడ్చి నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-4, 6-2తో యానినా విక్‌మాయెర్ (బెల్జియం)పై, పదో సీడ్ మకరోవా (రష్యా) 6-3, 6-2తో జూలియా (జర్మనీ)పై విజయం సాధించారు. శ్రమించిన ఆండీ ముర్రే: పురుషుల సింగిల్స్ విభాగంలో మూడుసార్లు రన్నరప్, ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఆస్ట్రేలియా ఆశాకిరణం కియోరిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నెగ్గడానికి ముర్రే తీవ్రంగానే శ్రమించాడు. 3 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-7 (5/7), 6-3, 7-5తో విజయం సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ నాదల్ 7-5, 6-1, 6-4తో 14వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, బెర్డిచ్ 6-2, 7-6 (7/3), 6-2తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, కియోరిస్ 5-7, 4-6, 6-3, 7-6 (7/5), 8-6తో సెప్పి (ఇటలీ)పై గెలిచారు. పేస్ జంట శుభారంభం: మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-6 (7/2)తో థాంప్సన్-జొవనోవిచ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 2-6, 6-3, 4-10తో నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో హేమలత
యూత్ ఒలింపిక్స్ ఆర్చరీ నాన్జింగ్: చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ ఆర్చరీలో... తెలుగు క్రీడాకారిణి బోడ హేమలత క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగం ప్రిక్వార్టర్స్‌లో హేమలత 7-3తో మేయా (ఇజ్రాయిల్)పై గెలిచింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి మెలానీతో హేమలత తలపడుతుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత క్రీడాకారుడు అతుల్ వర్మ క్వార్టర్స్‌కు చేరాడు. ప్రి క్వార్టర్స్‌లో అతుల్ 6-0తో తిహా (మలేసియా)పై నెగ్గాడు. శ్యామ్‌కుమార్‌కు నిరాశ పురుషుల బాక్సింగ్‌లో విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్‌కుమార్ ప్రిలిమినరీ దశలోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన బౌట్లో శ్యామ్ 1-2తో రుఫత్ (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. -
అతడే ఒక ‘సైన్యం’
మధ్య అమెరికాలో కేవలం 45 లక్షల జనాభా ఉన్న దేశం కోస్టారికా. రక్షణ కోసం సైన్యం లేకపోవడం ఈ దేశం ప్రత్యేకత. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ గోల్‌కీపర్ నవాస్ చూపించిన తెగువ చూస్తే... ఈ దేశానికి సైన్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా గ్రీస్ స్ట్రయికర్స్‌ను అడ్డుకున్న నవాస్... పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థి కిక్‌ను అడ్డుకుని కోస్టారికాను తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. - కోస్టారికాను క్వార్టర్స్‌కు చేర్చిన నవాస్ - పెనాల్టీ షూటౌట్లో గ్రీస్‌పై గెలుపు రెసిఫె: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో మరో ఫలితం పెనాల్టీ షూటౌట్ ద్వారానే తేలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో కోస్టారికా జట్టు గ్రీస్‌ను ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అలాగే ప్రి క్వార్టర్స్ దశలో రెండు మ్యాచ్ ల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం రావడం ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్, చిలీ జట్ల మధ్య ఫలితం కూడా ఇలాగే రావడం తెలిసిందే. అంతకుముందు మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోస్టారికా ఇంజ్యూరీ సమయం (90+1)లో గ్రీస్‌కు గోల్‌ను సమర్పించుకుంది. దీంతో ఎక్స్ట్రా సమయం అనివార్యమైంది. ఇక్కడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో కోస్టారికా తరఫున బోర్జెస్, రూయిజ్, గోంజలెజ్, క్యాంప్‌బెల్, ఉమానా గురి తప్పకుండా గోల్స్ సాధించారు. ఇక గ్రీస్ తరఫున మిట్రోగ్లూ, లేజరస్, కోలెవస్ వరుసగా గోల్స్ చేయగా కీలకమైన తరుణంలో గేకాస్ షాట్‌ను గోల్ కీపర్ నవాస్ అడ్డుకున్నాడు. దీంతో పరాజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోస్టారికా గోల్ కీపర్ నవాస్‌కు దక్కింది. క్వార్టర్స్‌లో ఈనెల 5న కోస్టారికా.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. - తొలిసారిగా నాకౌట్ దశలో ఆడిన గ్రీస్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించింది. 37వ నిమిషంలో స్ట్రయికర్ దిమిత్రియోస్ సల్పింగిడి అతి సమీపం నుంచి కొట్టిన షాట్‌ను కోస్టారికా గోల్ కీపర్ కీలర్ నవాస్ గాల్లో రెండు కాళ్లు చాపుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు. - ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో కోస్టారికా సాధించిన 16 గోల్స్‌లో 12 ద్వితీయార్ధంలోనే వచ్చాయి. ఈ ఆనవాయితీ కొనసాగింపుగా అన్నట్టు 52వ నిమిషంలో కోస్టారికా తమ గోల్ ఖాతాను తె రిచింది. - డిఫెన్స్‌ను ఛేదిస్తూ క్రిస్టియన్ బొలనాస్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న స్ట్రయికర్ బ్రియాన్ రూయిజ్ ఎడమ కాలితో నేర్పుగా గోల్ పోస్టు కుడివైపు చివరకు నెట్టి జట్టును ఆనందంలో నింపాడు. - 66వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు ఆస్కార్ డుయర్టెకు రెండో సారి ఎల్లో కార్డు చూపడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. - చివర్లో గ్రీస్ తమ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఇంజ్యూరీ సమయం ప్రారంభమైన నిమిషానికే కోస్టారికాకు షాక్ తగిలింది. ముందుగా గెకాస్ కొట్టిన షాట్ కీపర్ నవాస్‌కు తగిలి వెనక్కి వచ్చింది. గోల్ పోస్టుకు ఎదురుగా ఉన్న సోక్రటీస్ దీన్ని మెరుపు వేగంతో అందుకుని నెట్లోకి పంపాడు. దీంతో అప్పటిదాకా సంబరాల్లో మునిగిన కోస్టారికా అభిమానులు ఒక్కసారిగా నిరాశ కు గురయ్యారు. - ఎక్స్ట్రా సమయంలోనూ గ్రీస్ ప్రయత్నాలను కీపర్ నవాస్ వమ్ము చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్లో తమ జట్టే గెలవడంతో ఆటగాళ్లతో పాటు కోస్టారికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. -
చైనా ఓపెన్ క్వార్టర్సలో సానియా జోడి
బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం 6-3, 6-2తో పావ్లీచెంకోవా (రష్యా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడిపై గెలిచింది. తదుపరి రౌండ్లో సానియా జోడి యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)-జెంగ్ జీ (చైనా) లతో పోటీపడుతుంది. పేస్ జోడి కూడా ఇదే టోర్నీ పురుషుల డబుల్స విభాగంలో పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) జోడి కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ పేస్-నెస్టర్ జంట 6-2, 6-2తో జాన్ ఇస్నెర్-సామ్ క్వెరీ (అమెరికా) ద్వయంపై గెలిచింది. 50 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండో-కెనడియన్ జోడి రెండు ఏస్‌లు సంధించడంతోపాటు రెండు డబుల్ ఫాల్‌టలు చేసింది. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్‌లో బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్స) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో బోపన్న-వాసెలిన్ 7-5, 4-6, 10-6తో యువాన్ మొనాకో-జెబలాస్ (అర్జెంటీనా)లపై గెలిచారు.