క్వార్టర్స్‌కు చేరిన శ్రీకాంత్
టోక్యో: జపాన్ ఓపెన్‌లో తలపడుతున్న భారత ఆటగాళ్లలో కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే రేసులో మిగిలాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తన సహచర ఆటగాడు అజయ్ జయరామ్‌తో తలపడగా 21-16తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. అరుుతే గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే జయరామ్ తప్పుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 12-11తో జయరామ్ ఆధిక్యం కనబరిచినా ఆ తర్వాత శ్రీకాంత్ పుంజుకుని గేమ్‌ను దక్కించుకున్నాడు.
క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్.. మార్క్ జ్వీబ్లెర్ (జర్మనీ)తో తలపడతాడు. 2014లో జరిగిన ఇదే ఈవెంట్‌లో శ్రీకాంత్‌పై మార్క్ నెగ్గాడు. మరోవైపు హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 16-21, 19-21 తేడాతో రెండో సీడ్ విక్టర్ ఏక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 44 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రెండో గేమ్‌లో ప్రణయ్ గట్టి పోటీనే ఇచ్చినా విజయం సాధించలేకపోయాడు.