K Srikanth
-
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టెస్ట్‌లో (ఫిబ్రవరి 2 నుంచి) టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్‌కు అనుకూలించే వైజాగ్ ట్రాక్‌పై భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని.. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుందర్, కుల్దీప్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు, ఓ పేసర్ (బుమ్రా) ఐడియా సబబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు (బిషన్ సింగ్ బేడీ, బీఎస్ చంద్రశేఖర్, ఎర్రపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట్రాఘవన్) కలిసి ఆడిన సందర్భాలను ప్రస్తావించాడు. స్పిన్ వంద శాతం సహకరించే ట్రాక్‌పై నలుగురు స్పిన్నర్ల ఐడియా వర్కౌటవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతకొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్న శుభ్‌మన్ గిల్‌పై వేటు పడవచ్చు. గిల్ స్థానంలో రజత్ పాటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్సస్ మెరుగ్గా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రెండో టెస్ట్‌లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
పవర్‌గ్రిడ్ సీఎండీగా కె. శ్రీకాంత్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కె. శ్రీకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈయన కంపెనీ ఫైనాన్స్ విభాగ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. విద్యుత్ రంగంలో ఈయనకు 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని.. క్యాపిటల్ బడ్జెటింగ్ రూపకల్పన, దీర్ఘకాలిక ఫైనాన్స్ ప్లానింగ్, వనరుల సమీకరణ వంటి అంశాల్లో మంచి పట్టు ఉందని కంపెనీ బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. -
వరంగల్ నిట్‌లో కృష్ణమాచారి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగుంటున్నాయని.. అందువల్లే అభివద్ధిలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. వరంగల్ నిట్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ.. 'నేను తమిళనాడు వాడినే అయినా అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది. విద్యార్థులు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలి' అని సూచించారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అంటూ కొనియాడారు. ఆయన కెప్టెన్సీలో కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. యువతకు కార్పొరేట్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చేందుకు 'కెరీర్ స్ట్రోక్స్' కంపెనీని ఏర్పాటుచేసిన కృష్ణమాచారి శ్రీకాంత్. టాస్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న సొంతూళ్లోనే ఉద్యోగాలు కల్పిస్తాం అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాం ఫాం టూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకేచోట తయారీ వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్థిక రాజధాని దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్తర తెలంగాణ లో పండుతుందని పరిశోధనలో తేలింది టెక్స్ టైల్ పార్కు తోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుతో వరంగల్ నగర విస్తరణ హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు.. 1.20 లక్షల మందికి ఉపాధి టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కలశాలతో ఎంఓయూ ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు ఎన్నికల స్టంట్లా కాకుండా ఏడాదిలోగా పనులు పూర్తవుతాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఫ్యాషన్ రంగంలో నిఫ్ట్ తోనూ సంప్రదింపులు జరుపుతాం -
క్వార్టర్స్‌కు చేరిన శ్రీకాంత్
టోక్యో: జపాన్ ఓపెన్‌లో తలపడుతున్న భారత ఆటగాళ్లలో కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే రేసులో మిగిలాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తన సహచర ఆటగాడు అజయ్ జయరామ్‌తో తలపడగా 21-16తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. అరుుతే గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే జయరామ్ తప్పుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 12-11తో జయరామ్ ఆధిక్యం కనబరిచినా ఆ తర్వాత శ్రీకాంత్ పుంజుకుని గేమ్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్.. మార్క్ జ్వీబ్లెర్ (జర్మనీ)తో తలపడతాడు. 2014లో జరిగిన ఇదే ఈవెంట్లో శ్రీకాంత్‌పై మార్క్ నెగ్గాడు. మరోవైపు హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 16-21, 19-21 తేడాతో రెండో సీడ్ విక్టర్ ఏక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 44 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రెండో గేమ్‌లో ప్రణయ్ గట్టి పోటీనే ఇచ్చినా విజయం సాధించలేకపోయాడు. -
శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకు పదిలం
న్యూఢిల్లీ: ఇటీవల సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ గోల్డ్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలిచిన భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకును నిలుపుకున్నాడు. గురువారం బీడబ్యూఎఫ్(బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ తన ర్యాంకును పదిలంగా ఉంచుకోగా, భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఒక స్థానం దిగజారి 12 స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉండగా, భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రెండో ర్యాంకును కాపాడుకుంది. సయ్యద్ మోదీ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత ద్వయం ప్రణవ్ జెర్రీ చోప్రా-అక్షయ్ దివాల్కర్ లు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 34వ ర్యాంక్ లో నిలిచారు. మరోవైపు పారుపల్లి కశ్యప్ 15 వ స్థానానికి పడిపోయాడు. -
ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె పోరాటం ముగిసింది. గురువారం యమగుచి (జపాన్)తో 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 6-21 17-21తో సింధు ఓటమి పాలయింది. పురుషుల సింగిల్స్‌లో ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కాజుటెరు కొజయ్(జపాన్)పై శ్రీకాంత్ 21-12 21-16తో విజయం సాధించాడు. అరగంటలోనే మ్యాచ్ ముగించాడు. మరో మ్యాచ్‌లో జాన్ ఒ జొర్జన్సెన్(డెన్మార్క్)పై ప్రణయ్ 21-14 13-21 21-17తో గెలుపొందాడు.