జపాన్ ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ముగిసిన భారత్ పోరు
యోకోహామా: భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.
అషి్మత 16–21, 12–21తో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జోడీ 10–21, 18–21తో రెహాన్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment