క్వార్టర్స్‌లో హేమలత | Hemalatha in Youth Olympics Archery quarters in | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో హేమలత

Published Sun, Aug 24 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

క్వార్టర్స్‌లో హేమలత

క్వార్టర్స్‌లో హేమలత

యూత్ ఒలింపిక్స్ ఆర్చరీ
నాన్‌జింగ్: చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ ఆర్చరీలో... తెలుగు క్రీడాకారిణి బోడ హేమలత క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగం ప్రిక్వార్టర్స్‌లో హేమలత 7-3తో మేయా (ఇజ్రాయిల్)పై గెలిచింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి మెలానీతో హేమలత తలపడుతుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత క్రీడాకారుడు అతుల్ వర్మ క్వార్టర్స్‌కు చేరాడు. ప్రి క్వార్టర్స్‌లో అతుల్ 6-0తో తిహా (మలేసియా)పై నెగ్గాడు.
 
శ్యామ్‌కుమార్‌కు నిరాశ

పురుషుల బాక్సింగ్‌లో విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్‌కుమార్ ప్రిలిమినరీ దశలోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన బౌట్‌లో శ్యామ్ 1-2తో రుఫత్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement