భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి | Men's hockey: India lose to Belgium in quarter-finals | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

Published Mon, Aug 15 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

 క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి
 రియో డి జనీరో: రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 1-3 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. బెల్జియం  96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆట 15వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

 రెండో క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అయితే మూడో క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస దాడులతో భారత్‌పై ఒత్తిడి పెంచారు. 34వ, 45వ నిమిషాల్లో సెబాస్టియన్ డాకీర్ రెండు గోల్స్ చేయడంతో బెల్జియం 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 50వ నిమిషంలో టామ్ బూన్ గోల్‌తో బెల్జియం 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement