భారీగా వెచి్చంచిన సూర్మా హాకీ క్లబ్
అభిషేక్ కు రూ. 71 లక్షలు
హాకీ ఇండియా లీగ్ వేలం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో భారీ ధర పలికింది. ఆదివారం ప్రారంభమైన హెచ్‌ఐఎల్ లీగ్ తొలి రోజు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ రూ. 78 లక్షలు పెట్టి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను కొనుగోలు చేసుకుంది. వేలం మొదటి రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అభిషేక్ కోసం బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ రూ. 72 లక్షలు వెచ్చించగా.. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ హార్దిక్ సింగ్‌ను రూ. 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేసుకుంది.
తమిళనాడు డ్రాగన్స్ జట్టు అమిత్ రోహిదాస్ కోసం రూ. 48 లక్షలు వెచి్చంచగా... బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ జుగ్‌రాజ్‌కు అంత మొత్తమే ఇచ్చి తీసుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ తొలి రోజు వేలంలో అత్యధికంగా సుమిత్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో భారత్ నుంచి 54 మంది ప్లేయర్లతో పాటు 18 మంది విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 16 కోట్ల 88 లక్షల 50 వేలు ఖర్చు చేశాయి.
ఎనిమిది ఫ్రాంచైజీల్లో కళింగ లాన్సర్స్ వద్ద అత్యధికంగా రూ. 2.57 కోట్లు ఇంకా మిగిలి ఉండగా... అత్యల్పంగా బెంగాల్ టైగర్స్ వద్ద రూ. 1.44 కోట్లు పర్స్ మనీ ఉంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ వద్ద ఇంకా రూ. 2.04 కోట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన గొంజలో పైలట్ అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. అతడికోసం తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 68 లక్షలు వెచ్చించింది. నెదర్లాండ్స్‌కు చెందిన జిప్ జాన్‌సెన్‌ను రూ. 54 లక్షలు పెట్టి తమిళనాడు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment