చైనా ఓపెన్ క్వార్టర్‌సలో సానియా జోడి
చైనా ఓపెన్ క్వార్టర్‌సలో సానియా జోడి
Published Thu, Oct 3 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్‌స విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం 6-3, 6-2తో పావ్లీచెంకోవా (రష్యా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడిపై గెలిచింది. తదుపరి రౌండ్‌లో సానియా జోడి యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)-జెంగ్ జీ (చైనా) లతో పోటీపడుతుంది. పేస్ జోడి కూడా
ఇదే టోర్నీ పురుషుల డబుల్‌స విభాగంలో పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) జోడి కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ పేస్-నెస్టర్ జంట 6-2, 6-2తో జాన్ ఇస్నెర్-సామ్ క్వెరీ (అమెరికా) ద్వయంపై గెలిచింది. 50 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండో-కెనడియన్ జోడి రెండు ఏస్‌లు సంధించడంతోపాటు రెండు డబుల్ ఫాల్‌టలు చేసింది. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్‌లో బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్‌స) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బోపన్న-వాసెలిన్ 7-5, 4-6, 10-6తో యువాన్ మొనాకో-జెబలాస్ (అర్జెంటీనా)లపై గెలిచారు.
Advertisement
Advertisement