క్వార్టర్ ఫైనల్లో జయరాం | Indonesia Grand Prix Gold: Ajay Jayaram only Indian to reach quarter-finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో జయరాం

Published Fri, Sep 9 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

క్వార్టర్ ఫైనల్లో జయరాం

క్వార్టర్ ఫైనల్లో జయరాం

బలిక్‌పపన్: ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అజయ్ జయరాం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. జయరాం మినహా మిగతా భారత షట్లర్లంతా టోర్నీనుంచి నిష్ట్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జయరాం రెక్సీ మేగానంద (ఇండోనేసియా)పై 18-21, 21-12, 21-19 స్కోరుతో విజయం సాధించాడు. అంతకు ముందు రెండో రౌండ్ మ్యాచ్‌లో అజయ్... భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌పై గెలుపొందడం విశేషం.

గాయంనుంచి కోలుకున్న తర్వాత మొదటి టోర్నీ ఆడుతున్న కశ్యప్ తొలి మ్యాచ్ విజయం తర్వాత ముందుకు వెళ్లలేకపోయాడు. జయరాం 21-7, 21-12తో కశ్యప్‌ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ 27 నిమిషాల్లోనే ముగిసింది. ఇతర మ్యాచ్‌లలో సాయి ప్రణీత్ 14-21, 13-21తో బూన్‌సాక్ (థాయిలాండ్) చేతిలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 21-19, 19-21, 21-23తో జియాంక్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement