Australia Open 2022: Daniil Medvedev Serious On Umpire, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌

Published Fri, Jan 28 2022 8:16 PM | Last Updated on Fri, Jan 28 2022 9:31 PM

Are-You Stupid Medvedev Burst-Out Chair Umpire At Australian Open 2022 - Sakshi

మ్యాచ్‌లో ఆటగాళ్లకు అంపైర్‌తో వివాదాలు సహజమే.  ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. టెన్నిస్‌ కూడా దీనికి అతీతం కాదనే చెప్పొచ్చు. తాజాగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నెంబర్‌ రెండో ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడు. కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రెండోసెట్‌ ముగిసిన తర్వాత ఇది చోటుచేసుకుంది. ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి వద్ద మ్యాచ్‌కు సంబంధించి సలహా తీసుకున్నాడు.  

చదవండి: Shoaib Akhtar: పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి

ఇది గమనించిన మెద్వెదెవ్‌.. చైర్‌ అంపైర్‌ జౌమ్ క్యాంపిస్టల్ చూస్తూ.. ''సిట్సిపాస్‌ తన తండ్రి సలహా తీసుకొని కోడ్‌ ఆఫ్‌ వయలేషన్‌ను ఉల్లఘించాడు.. ఇది నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు. అంపైర్‌ చెప్పేది వినిపించుకోకుండానే మెద్వెదెవ్‌ మరోసారి గట్టిగా అరిచాడు.''సిట్సిపాస్‌కు తన తండ్రి ఏ పాయింట్‌ గురించైనా మాట్లాడుండొచ్చు.. ఆర్‌ యూ స్టుప్టిడ్‌.. అతని తండ్రి ఏ పాయింట్‌ గురించైనా మాట్లాడుండొచ్చు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.. ఒక గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో ఇంత బ్యాడ్‌ అంపైర్‌ ఉంటారా.. ఓ మై గాడ్‌.. నీతోనే మాట్లాడుతున్నా నన్ను చూడు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం మెద్వెదెవ్‌ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరాడు.

అంతకముందు ఇదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రఫేల్‌ నాదల్‌, కెనడా టెన్నిస్‌ ఆటగాడు డెనిస్‌ షాపోవాలో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. చైర్‌ అంపైర్‌ నాదల్‌తో కుమ్మక్కయ్యాడని.. అవినీతి అంపైర్‌ అంటూ షాపోవాలో దూషించడం సంచలనంగా మారింది. ఇంతటితో ఊరుకొని షాపోవాలో... నాదల్‌కు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్‌.. కన్నీటిపర్యంతం

ఇక పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో డానిల్‌ మెద్వెదెవ్‌ విజయం సాధించాడు. గ్రీక్‌కు చెందిన నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్‌ ఫైనల్లో అడుగపెట్టాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో మెద్వెదెవ్‌.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement