యూఎస్ ఓపెన్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆధిక వేడివల్ల ప్లేయర్స్ అనారోగ్యం బారిన పడుతున్నారు. బుధవారం జరిగిన యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. యుఎస్ ఓపెన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్) మధ్య మ్యాచ్ ఆడిన మెద్వెదెవ్ వేడి కారణంగా శ్వాస తీసుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.
ఆట రెండో సెట్‌కు మరో సమయంలో అతడిని ఫిజియో పరీక్షించాడు. ఫిజియో సలహా మెరకు ఇన్‌హేలర్ సాయంతో మిగిలిన ఆటను మెద్వెదేవ్ పూర్తిచేశాడు. అయితే మ్యాచ్ గేమ్ అనంతరం మెద్వెదేవ్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ పరిస్థితుల కారణంగా ఒక ఆటగాడు చనిపోయినా వీళ్లు అలానే చూస్తూ ఉంటారని మెద్వెదేవ్ అసహనం వ్యక్తం చేశాడు.
యూఏస్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఆడటం చాలా కష్టంగా అన్పించింది. ఈ వేడిని తట్టుకో లేక ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు వీళ్లు చూస్తూనే ఉంటారు. ఇంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో నేను ఒక్కడినే కాకుండా ఆండ్రీ రుబ్లెవ్ కూడా వేడిని తట్టుకోలేకపోయాడు
తొలి సెట్ ఆరంభంలో ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కన్పించాయి. కానీ మూడో సమయానికి నేను బంతిని కూడా చూడలేకపోయాను. అవతలి ఎండ్‌లో నా ప్రత్యర్ధి అలిపోయనట్లు కన్పించి వెంటనే పుంజుకుంటున్నాడు. గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అని మెద్వెదేవ్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను 6–4, 6–3, 6–4తో మెద్వెదెవ్ ఓడించాడు. ఈ విజయంతో యూఎస్ ఓపెన్ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్‌తో మెద్వెదెవ్ తలపడతాడు.
చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment