Cincinnati Masters: పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మెద్వెదెవ్‌ | Cincinnati Masters: Daniil Medvedev advances to semifinals | Sakshi
Sakshi News home page

Cincinnati Masters: పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మెద్వెదెవ్‌

Published Sun, Aug 21 2022 6:25 AM | Last Updated on Sun, Aug 21 2022 6:25 AM

Cincinnati Masters: Daniil Medvedev advances to semifinals - Sakshi

సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మెద్వెదెవ్‌ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు.

2019లో ఈ టోర్నీ టైటిల్‌ సాధించిన మెద్వెదెవ్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో తలపడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో సిట్సిపాస్‌ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌లో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌)పై, బోర్నా చొరిచ్‌ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్‌ అలియాసిమ్‌ (కెనడా)పై నెగ్గారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement