Novak Djokovic: మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్‌.. వారం ఉన్నా గొప్పే కదా! | Novak Djokovic In No 1 Rank After Daniil Medvedev Loses in Indian Wells | Sakshi
Sakshi News home page

Novak Djokovic: మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్‌.. వారం ఉన్నా గొప్పే కదా!

Published Wed, Mar 16 2022 8:34 AM | Last Updated on Wed, Mar 16 2022 8:46 AM

Novak Djokovic In No 1 Rank After Daniil Medvedev Loses in Indian Wells - Sakshi

Novak Djokovic: ఏటీపీ వరల్డ్‌ నంబర్‌వన్‌గా రష్యా ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఆనందం మూడు వారాలకే పరిమితం కానుంది. ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ చేరితే గానీ అగ్ర స్థానంలో నిలవలేని మెద్వెదెవ్‌ మూడో రౌండ్‌లో 6–4, 3–6, 1–6 తేడాతో గేల్‌ మాన్‌ఫిల్స్‌ చేతిలో పరాజయంపాలయ్యాడు.

సోమవారం ప్రకటించే ర్యాంకుల్లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు మళ్లీ అగ్ర స్థానం దక్కుతుంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్‌ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎప్పటికీ నంబర్‌వన్‌ కాకపోవడంకంటే ఒక వారం ఉన్నా గొప్పే కదా’ అని వ్యాఖ్యానించాడు. కాగా జొకోవిచ్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు నిరాకరించిన కారణంగా ఇప్పటికే పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే.

చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మ్యాచ్‌ జరుగుతుండగానే కాల్పులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement