ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సరికొత్త ఛాంపియన్‌గా ఇటలీ యువ సంచలనం జనిక్ సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2024 పురుషల సింగిల్ విజేతగా జనిక్ సినర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో సంచలన విజయం సాధించాడు.
తొలి రెండు సెట్లలో ఓడిపోయిన సినర్.. తిరిగి పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. 22 ఏళ్ల యానిక్ సినెర్‌కు మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను సినెర్ ఓడించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా సినర్ రికార్డులకెక్కాడు. సినర్ కంటే ముందు రోలాండ్ గారోస్, నికోలా పిట్రాంజెలీ టైటిల్‌లను గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment