క్వార్టర్స్‌లో పేస్-వావ్రింకా జంట | Pace-Wawrinka couple of quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో పేస్-వావ్రింకా జంట

Published Thu, Aug 20 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Pace-Wawrinka couple of quarters

సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో పేస్-వావ్రింకా జంట 7-6 (7/4), 3-6, 10-3(సూపర్ టైబ్రేక్)తో వాసెక్ పోస్పిసిల్ (కెనడా)-జాక్ సోక్ (అమెరికా) జోడీపై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement