అంపైర్ను బంతితో కొట్టాడు! | Denis Shapovalov Disqualified From Davis Cup Match For Hitting Umpire In Face With Ball | Sakshi
Sakshi News home page

అంపైర్ను బంతితో కొట్టాడు!

Published Tue, Feb 7 2017 9:28 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

అంపైర్ను బంతితో  కొట్టాడు!

అంపైర్ను బంతితో కొట్టాడు!

ఒట్టావా: కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్.. తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్ను బలంగా  కొట్టిన ఘటన డేవిస్ కప్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుసగా రెండు సెట్లు కోల్పోయిన షపోవాలవ్.. మూడో సెట్లో కూడా వెనుకబడిపోయాడు. మూడో సెట్లో షపోవాలవ్ 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. 

 

ఆ క్రమంలోనే అతిగా స్పందించి బంతిని అంపైర్ గాబస్ కూర్చొన్న స్టాండ్ వైపు గట్టిగా కొట్టాడు. ఆ బంతి కాస్తా అంపైర్ ముఖానికి  బలంగా తాకడంతో అతను విలవిల్లాడిపోయాడు. తొలుత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఒట్టావాలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంపైర్ ఎడమ కన్నుపై తీవ్రంగా వాచినట్లు కెనడా డేవిస్ కప్ సభ్యుడొకరు తెలిపారు. కాగా, అంపైర్ ను బంతితో కొట్టిన డెనిస్ షపోవాలవ్ ను డేవిస్ కప్ నుంచి బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement