ప్రపంచ జూనియర్ మహిళల హాకీలో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ మహిళల హాకీలో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
గతంలో ఎన్నడూ ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్ కూడా చేరుకోలేని జట్టు ఈసారి పతకంతో తిరిగి రావడంపై కెప్టెన్ సుశీల చాను సంతోషం వ్యక్తం చేసింది. కాంస్య పతకం పోరులో తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నా అధిగమించామని చెప్పింది. మరోవైపు గత జూన్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-3లో భారత సీనియర్ జట్టు పేలవంగా ఆడి ఏడో స్థానంలో నిలవగా అందులో ఆడిన 12 మంది ఆటగాళ్లు ప్రస్తుత జూనియర్ జట్టులో ఉండడం గమనార్హం.