క్వార్టర్ ఫైనల్స్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ | west indies,England entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్స్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్

Published Wed, Feb 19 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

west indies,England entered in quarter finals

 అండర్-19 ప్రపంచకప్
 అబుదాబి: అండర్-19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. మంగళవారం షేక్ జయేద్ స్టేడియం నర్సరీ 1లో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 63 పరుగుల తేడాతో కెనడా జట్టును ఓడించింది. తేజ్‌నరైన్ చందర్‌పాల్ (127 బంతుల్లో 93; 5 ఫోర్లు; 1 సిక్స్) తన అద్భుత ఫామ్ కొనసాగించడంతో... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 289 పరుగులు చేసింది.
 
 
 నికోలస్ పూరన్ (41 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు; 4 సిక్స్‌లు), సొలోజనో (72 బంతుల్లో 50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెనడా కుర్రాళ్లు 49.3 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌట్ అయ్యారు. నిఖిల్ దత్తా (107 బంతుల్లో 62; 2 ఫోర్లు), నితీష్ కుమార్ (56 బంతుల్లో 50; 6 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
 
 మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. హిగ్గిన్స్ (83; 5 ఫోర్లు; 2 సిక్స్‌లు) ఆటతీరుతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 229 పరుగులు చేసిన ఇంగ్లండ్.. కివీస్‌ను 36.1 ఓవర్లలో 114కు ఆలౌట్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement