
మహిళల డబుల్స్‌పైనే ఆశలు
స్క్వాష్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే సింగిల్స్‌లో ఏ ఒక్కరూ పతకం గెలుచుకోలేకపోగా శుక్రవారం జరిగిన రెండు మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనూ భారత జంటలు ఓటమిపాలయ్యాయి.
తొలుత హరిందర్‌పాల్ సంధు-జోష్న చినప్ప జోడి క్వార్టర్స్‌లో 11-7, 8-11, 6-11తో న్యూజిలాండ్ జంట మార్టిన్ నైట్-జోలె కింగ్ చేతిలో ఓడింది. మరో మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషల్-దీపికా పల్లికల్ జోడి 6-11, 9-11తో ఆస్ట్రేలియా ద్వయం పాల్మెర్-గ్రిన్హామ్ చేతిలో ఓటమిపాలైంది. భారత్ ఆశలన్నీ ఇక మహిళల డబుల్స్‌పైనే ఉన్నాయి.